: ఓటు వేద్దామంటే వణికిస్తున్న చలి
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ మందకొడిగా సాగుతోంది. కాశ్మీర్ లోయ, లడఖ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతుండటంతో ఓటర్లు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు రావటానికి భయపడుతున్నారు. కొందరు ఔత్సాహికులు వణికిస్తున్న చలిని సైతం లెక్కచేయక పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఉదయం 11 గంటల ప్రాంతంలోనూ ఉష్ణోగ్రత 6 డిగ్రీలు మాత్రమే ఉండటంతో మధ్యాహ్నం తరువాత ఓటర్ల రాక పెరుగుతుందని భావిస్తున్నారు. కాగా, తొలిదశలో జమ్మూ డివిజన్లో 6, కాశ్మీర్ లోయలో 5, లడఖ్ లో 4 అసెంబ్లీ నియోజకవర్గాలలో నేడు పోలింగ్ జరుగుతోంది.