: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎంపై ఫిర్యాదు


బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝిపై శరన్ జిల్లాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రాధేశ్యామ్ శుక్లా కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. రాష్ట్రంలోని అగ్ర కులాల వారిపై వ్యాఖ్యలు చేసి సమాజంలో అసమ్మతిని రేపారంటూ రాజ్ కిషోర్ గిరి అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 500 (పరువు నష్టానికి శిక్ష), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 505 (ప్రజా అల్లర్లు జరిగే విధంగా ప్రకటనలు చేయడం) అభియోగాలను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నత కులాల వారు 'విదేశీయులు' అంటూ మాంఝి చేసిన వ్యాఖ్యలు బీహార్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News