: ఒబామా టీంలో రాలిన తొలి వికెట్


అమెరికాలో డెమోక్రాట్లకు మెజారిటీ రోజురోజుకూ తగ్గుతుండటం, జాతీయ భద్రతా దళంపై పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో ఒబామా కేబినెట్ బీటలు వారడం మొదలైంది. రక్షణ శాఖ కార్యదర్శి చుక్ హాగెల్ తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా బాధ్యతలు చేపట్టిన తరువాత కేబినెట్ హోదా ఉన్న వ్యక్తి రాజీనామా చేయటం ఇదే తొలిసారి. అయితే, ఆయనను ఒబామానే తొలగించాలని భావించారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులను ఏ విధంగా ఎదుర్కోవాలన్న విషయమై హాగెల్ సరైన రీతిలో స్పందించలేకపోతున్నారని, అందువల్లనే ఆయనను తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. గత రెండేళ్లుగా ఒబామా సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News