: మరిన్ని యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్న భారత నౌకాదళం


భారత నౌకాదళం అమ్ములపొది మరింత శక్తిమంతం కానుంది. అమెరికన్ సంస్థ బోయింగ్ నుంచి మరో నాలుగు పి-81 లాంగ్‌ రేంజ్‌ మేరీటైమ్‌ పెట్రోల్‌ అండ్‌ యాంటీ సబ్‌ మెరైన్‌ వార్‌ ఫేర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ కొనుగోలు చేయాలని నౌకాదళం భావిస్తోంది. ఇప్పటికే ఈ తరహా విమానాలు ఆరింటిని భారత్ డెలివరీ తీసుకుంది. ఆరవ విమానం తమిళనాడు అరక్కోణం తీరంలో ఉన్న ఐఎన్ఎస్ రాజాలిపై ల్యాండ్ అయింది. మొత్తం రూ.12 వేల కోట్ల విలువైన ఒప్పందంలో భాగంగా మరో రెండు యుద్ధ విమానాలు 2015లో ఇండియాకు రానున్నాయి. ముందుగా అనుకున్న సమయానికి విమానాల డెలివరీ జరుగుతోందని, అందువల్ల మరో 4 విమానాలకు ఆర్డర్ ఇచ్చే అవకాశముందని ఓ అధికారి తెలిపారు. కాగా, పి-81 లాంగ్‌ రేంజ్‌ విమానంలో ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు యాంటీ సబ్‌ మెరైన్‌ కార్యకలాపాలకు అవసరమైన టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సెన్సార్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News