: ప్రముఖ కథక్ నృత్యకారిణి సితారాదేవి కన్నుమూత
ప్రఖ్యాత నృత్యకారిణి సితారాదేవి ఈ తెల్లవారుజామున మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబయిలోని జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆమె అల్లుడు రాజేశ్ మిశ్రా తెలిపారు. ఆమె వయస్సు 94 ఏళ్లు.