: ఖమ్మంలో మావోయిస్టుల పోస్టర్ల కలకలం
ఖమ్మం జిల్లాలో సోమవారం మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. పీఎల్ జీఏ సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ వెలసిన సదరు పోస్టర్లు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పోలీసు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్నటిదాకా ఖమ్మం సరిహద్దులోని ఛత్తీస్ గఢ్ లోనే మావోల సంచారం కనిపించింది. తాజాగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులు పోస్టర్లను అతికించారు. దీంతో జిల్లాలో మావోల కార్యకలాపాలపై పోలీసు ఉన్నతాధికారులు కురిపించే ప్రశ్నల వర్షానికి సమాధానాలు వెతుక్కునే పనిలో జిల్లా పోలీసు యంత్రాంగం తలమునకలైంది.