: జార్ఖండ్, కాశ్మీర్ లలో ప్రారంభమైన పోలింగ్


జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమయింది. జార్ఖండ్ లోని 13 స్థానాలు, కాశ్మీర్ లోని 15 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. జార్ఖండ్ లో 33.65 లక్షలు, జమ్మూ కాశ్మీర్ లో 10.50 లక్షల మంది ఓటర్లు ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జార్ఖండ్ లో ఈ రోజు పోలింగ్ జరుగుతున్న 13 నియోజకవర్గాలు కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలే కావడంతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అలాగే, పోలింగ్ ను బహిష్కరించాలంటూ జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రవాద సంస్థలు పిలుపునివ్వడంతో, అక్కడ కూడా భద్రతను మరింత పెంచారు.

  • Loading...

More Telugu News