: ఎన్టీఆర్ పేరుపై నేడు రాజ్యసభలో నిరసన తెలుపుతా: వీహెచ్


శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై నేడు రాజ్యసభలో నిరసన తెలపనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు తెలిపారు. డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును తక్షణమే ఉపసంహరించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోని పక్షంలో బుధ, గురువారాల్లో పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఎంపీలమంతా కలిసి నిరసన దీక్షకు దిగుతామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News