: ఏపీలో పెరగనున్న స్టాంప్ డ్యూటీ రుసుములు
నిధుల లేమితో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వం ఆదాయ వనరులను మెరుగుపరుచుకునే పనిలో నిమగ్నమైనట్టు కనిపిస్తోంది. తాజాగా రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ రుసుములను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఫీజును అరశాతం నుంచి ఒక శాతానికి పెంచుతున్నారు. స్టాంప్ డ్యూటీ నాలుగు నుంచి ఐదు శాతానికి పెరగనుంది. కుటుంబ సభ్యుల మధ్య జరిగే లావాదేవీలకు సంబంధించి స్టాంప్ డ్యూటీని ఒకటి నుంచి రెండు శాతానికి పెంచుతున్నారు. ఇతర ఒప్పందాలకు ప్రస్తుతం రెండు శాతం స్టాంపు డ్యూటీ ఉండగా... ప్రస్తుతం అది నాలుగు శాతానికి పెరగనుంది. అయితే, భూముల విలువను మాత్రం ఇప్పటికిప్పుడే పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.