: రాజధాని నిర్మాణానికి రూ. 1,20,013 కోట్లు ఇవ్వండి: కేంద్రానికి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు


రాజధాని అవసరాల నిమిత్తం ప్రతిపాదనలను పంపాలని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో, రాజధాని నిర్మాణానికి రూ. 1,20,013 కోట్లు అవసరమని కేంద్రానికి ప్రతిపాదనలను పంపింది ఏపీ సర్కార్. ఈ ప్రతిపాదనల కాపీలను ప్రణాళిక సంఘం, ఆర్థిక సంఘానికి కూడా పంపారు. ప్రతిపాదనల్లోని ప్రధాన అంశాలు ఇవే. * భూ సేకరణకు - రూ. 20,500 కోట్లు * వివిధ జిల్లాల నుంచి రాజధానికి రోడ్ల నిర్మాణానికి - రూ. 12,930 కోట్లు * విద్యుత్, కేబుల్ వ్యవస్థకు - రూ. 12,000 కోట్లు మిగిలిన మొత్తాన్ని శాసనసభ, రాజ్ భవన్, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, డ్రైన్ లు, ఇతర మౌలిక వసతుల నిర్మాణం కోసం అడిగారు. ఇప్పటిదాకా దేశంలోని ఏ రాజధాని నిర్మాణానికైనా రూ. 500 కోట్లకు మించి ఇచ్చిన దాఖలాలు లేవనే చెప్పాలి. మరి, లక్ష కోట్లకు పైగా అడిగిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కోరికను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు తీరుస్తుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News