: నేడు నేపాల్ కు ప్రధాని నరేంద్ర మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ నేడు నేపాల్ వెళ్లనున్నారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న సార్క్ దేశాల సదస్సులో పాల్గొనే నిమిత్తం ఆయన నేడు నేపాల్ రాజధాని ఖాట్మండూ బయలుదేరతారు. సార్క్ దేశాల సదస్సులో భాగంగా ‘ప్రాంతీయ సహకారం’పై మోదీ ప్రసంగించనున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య భేటీ జరిగే అవకాశాలు లేకపోలేదని ఇటు భారత విదేశాంగ శాఖతో పాటు అటు పాక్ అధికారులు కూడా పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News