: ఏడు రోజుల్లోగా అన్ని అనుమతులు: జపాన్ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆఫర్


తమ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఏడు రోజుల్లోగానే అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన సందర్భంగా ఈ మేరకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. వారంలోగా అన్ని అనుమతులు రానిపక్షంలో ఎనిమిదో రోజు తమ పెట్టుబడులతో సదరు పారిశ్రామికవేత్తలు వెనక్కెళ్లొచ్చని ఆయన ప్రకటించారు. సోమవారం అక్కడి ఎన్ఐడీఈసీ, ఎన్మార్ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ‘భారత్ లో పేరుకుపోయిన అలసత్వం కారణంగా వాణిజ్యం నెరపడం కష్టం కాదా?’అని ఎన్ఐడీఈసీ అద్యక్షుడు షిహెనొబు నాగమోరి సందేహం వ్యక్తం చేయడంతో చంద్రబాబు ఘాటుగా స్పందించారు. 'ఏడు రోజుల్లోగా అనుమతులు ఇవ్వకపోతే ఎనిమిదో రోజు మీరు వెనక్కెళ్లొచ్చు' అంటూ నాగమోరికి ఆయన సమాధానమిచ్చారు. భారత్ లో పరిస్థితులు మారాయని, ప్రత్యేకించి ఏపీలో పెట్టుబడులతో ముందుకొచ్చే వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలకనున్నామని ఆయన తెలిపారు. అంతేకాక ఏపీలో వ్యాపారానికి అపార అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News