: సవరణ చేయకపోతే బీమా బిల్లు వ్యతిరేకిస్తాం: శివసేన


బీజేపీ, శివసేన మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతోంది. రెండు పార్టీలు చిక్కడు దొరకడు ఆట ఆడుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి. తాజాగా శివసేన చేసిన వ్యాఖ్యలు అదే భావాన్ని బలపరుస్తున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బీమా బిల్లుకు సవరణలు చేయని పక్షంలో దానిని వ్యతిరేకించేందుకు వెనుకాడమని శివసేన స్పష్టం చేసింది. రైతులు, ఉద్యోగుల ప్రయోజనాలకు అనుగుణంగా సవరణలు ఉండాలని శివసేన డిమాండ్ చేస్తోంది. కాగా, యూపీఏ ప్రవేశపెట్టే బిల్లునే ఎన్డీయే కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా ఆలోచిస్తోంది. దీంతో బీమా బిల్లు ఆమోదం పొందుతుందో, లేదో... శివసేన బీజేపీకి మద్దతిస్తుందో, లేదోనని ఇతర పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

  • Loading...

More Telugu News