: భారత్, పాక్ ప్రధానులు సమావేశమవుతారా?
భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. వేర్పాటు వాదులతో చర్చలు ఆపేస్తేనే పాక్ తో నిర్మాణాత్మక చర్చలు జరుపుతామని భారత్ స్పష్టం చేసింది. వేర్పాటు వాదులతో చర్చించిన తరువాతే భారత్ తో చర్చలు జరుపుతామని పాక్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతాయా? లేదా? అని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఇరు దేశాల ప్రధానుల భేటీపై రేపటి వరకు ఆగాలంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొనగా, భేటీపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని నవాజ్ షరీఫ్ సలహాదారు సర్తాజ్ అజీజ్ తెలిపారు. దీంతో వీరి భేటీపై ప్రతిష్ఠంభన ఇంకా తొలగలేదు.