: కేసీఆర్ ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తున్నారు: కిషన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎంఐఎంతో పొత్తు టీఆర్ఎస్ కు ప్రమాదకరమని హెచ్చరించారు. విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్ గఢ్ కు వెళ్లేందుకు కేసీఆర్ కి ఆరు నెలల సమయం పట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలే ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తాయని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.