: ఛాంపియన్స్ ట్రోఫీకి మన హాకీ జట్టు ఇదే


డిసెంబర్ 6 నుంచి 14 వరకు భువనేశ్వర్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత పురుషుల హాకీ జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. సర్దారా సింగ్ నేతృత్వంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. గోల్ కీపర్లుగా శ్రీజేష్, హర్ జ్యోత్ సింగ్ వ్యవహరించనుండగా, రక్షణశ్రేణి భారం రూపేందర్ సింగ్, రఘునాథ్, బీరేంద్ర లక్రా, కొతజిత్ సింగ్, గుర్బాజ్ సింగ్, గర్జిందర్ సింగ్ మోయనున్నారు. మిడ్ ఫీల్డర్లుగా మన్ ప్రీత్ సింగ్, సర్థారా సింగ్, ధరంవీర్ సింగ్, డానిష్ ముజ్తబా, ఎస్ కే ఊతప్ప వ్యవహరిస్తారు. రమణ్ దీప్ సింగ్, ఎస్వీ సునీల్, ఆకాశ్ దీప్, నితిన్ తిమ్మయ్య, లలిత్ ఉపాధ్యాయ ప్రత్యర్థులపై దాడులు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News