: తీవ్రవాదులకు దేశం, ప్రాంతంతో సంబంధం లేదు: మమతా
తీవ్రవాదులకు దేశం, ప్రాంతంతో సంబంధం లేదని, తీవ్రవాదులు తీవ్రవాదులేనని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, బంగ్లాదేశీయులు తమకు సోదరులని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు ఒకరిద్దరి వల్లే చెడ్డపేరు వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో అధికారం చేపట్టిన ప్రతి పార్టీ సీబీఐని దుర్వినియోగం చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. దాని ఫలితంగానే సీబీఐకి సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేస్తోందని దీదీ అభిప్రాయపడ్డారు.