: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్
తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగాల్లో 1,07,744 ఖాళీలు ఉన్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని అన్నారు. నిరుద్యోగులకు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తామని అన్నారు. ఐదేళ్ల సడలింపు కల్పిస్తామని, 4 లేక 5 నెలల్లో ఉద్యోగాల జాతర మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. కమల్ నాథన్ కమిటీ ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తిచేస్తే, ఎంతమంది తెలంగాణలో ఉంటారో, ఎంత మంది పోతారో తెలుస్తుందని ఆయన వివరించారు. విద్యుత్ శాఖ ఖాళీల భర్తీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందికే ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నాళ్లుగానో ఉద్యోగాలు దక్కుతాయంటూ ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు ఇది శుభవార్తే.