: భారత్ దూసుకెళుతోంది... పెట్టుబడులకు ఏపీ అనుకూలం: చంద్రబాబు


జపాన్ పర్యటనలో వరుస సమావేశాలు జరుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ఐడీఈసీ సంస్థ చైర్మన్, ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, భారత్ వేగంగా ముందుకెళుతోందని అన్నారు. కేంద్రం, ఏపీ సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బలంగా ఉన్నాయని బాబు చెప్పారు. పెట్టుబడులకు ఏపీి అనువైన రాష్ట్రమని వివరించారు. తమ వద్ద నిపుణులైన శ్రామికులు ఉన్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News