: హరీష్ రావు సభను తప్పుదోవపట్టిస్తున్నారు: అక్బరుద్దీన్


మంత్రి హరీష్ రావు శాసనసభను తప్పుదోవపట్టిస్తున్నారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. శాసనసభలో అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఉద్యోగాల భర్తీ అంశంపై తమను మాట్లాడనీయనందుకు నిరసనగా ఎంఐఎం పార్టీ తెలంగాణ శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. 344 నిబంధన ప్రకారం నోటీసు ఇచ్చిన సభ్యులే ఆయా అంశాలపై మాట్లాడాలని స్పీకర్ మధుసూదనాచారి చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్, అలాంటప్పుడు విద్యుత్ అంశంపై అన్ని పార్టీలు మాట్లాడేందుకు ఎందుకు అనుమతించారని స్పీకర్ ను నిలదీశారు. అది బీఏసీ నిర్ణయమని మంత్రి హరీష్ రావు స్పీకర్ నిర్ణయాన్ని సమర్థించడంతో, బీఏసీ నిర్ణయం తాలూకు డాక్యుమెంటును సభలో ప్రవేశపెట్టాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించిన ఆయన, దీనిపై రాజీనామాకైనా సిద్ధమని సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News