: మరింత సురక్షిత ప్రాంతానికి దావూద్ ఇబ్రహీం!
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను మరింత సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఐఎస్ఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనను థాయ్ లాండ్, నైరోబి, బంగ్లాదేశ్, లేదా యూఏఈలలో ఏదో ఒక చోటకు తరలించాలన్నది ఐఎస్ఐ ప్రణాళికగా కనిపిస్తోంది. గతవారంలో ఒకసారి దావూద్ ను షిఫ్ట్ చేయాలని భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో వెనక్కు తగ్గినట్టు సమాచారం. ఐఎస్ఐలోని సీనియర్ అధికారులు, పాక్ సైన్యం దావూద్ ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.