: నేను క్షేమంగానే ఉన్నాను... అవన్నీ పుకార్లే!: డిస్కో శాంతి
దివంగత నటుడు శ్రీహరి భార్య, ప్రత్యేక గీతాల ద్వారా టాలీవుడ్, కోలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు కలిగిన నటి డిస్కోశాంతి ఆరోగ్యస్థితిపై గత కొంత కాలంగా మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అవన్నీ పుకార్లని శాంతి కొట్టిపడేశారు. చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. పచ్చకామెర్ల కారణంగా అనారోగ్యం పాలైన విషయం వాస్తవమే అయినప్పటికీ, మీడియా పేర్కొంటున్నట్టు తన పరిస్థితి విషమంగా లేదని అన్నారు. సోషల్ మీడియా పుకార్లతో కంగారుపడ్డ తన కుమారులు, చెన్నైలో ఉన్న తనకు ఫోన్ చేసి ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని ఆమె చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో తనకు మెరుగైన వైద్యం అందిందని తెలిపిన ఆమె, ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. చెన్నైలోని తన సోదరి లలితకుమారి ఇంట్లో క్షేమంగా ఉన్నానని ఆమె వివరించారు.