: క్రికెట్ జెంటిల్మన్ గేమ్ గానే ఉండాలి... ఫిక్సింగ్ అన్నది ఆటను చంపేస్తుంది: సుప్రీం
క్రికెట్ జెంటిల్మన్ గేమ్ గానే ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. క్రికెట్ ను నిజమైన క్రీడాస్ఫూర్తితో ఆడాలని ఆటగాళ్లకు సూచించింది. ముద్గల్ కమిటీ అందజేసిన నివేదిక ఆధారంగా విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. ఫిక్సింగ్ కు ఆటలో స్థానం కల్పిస్తే క్రికెట్ ను సమాధి చేసినట్టేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.