: డీఎల్ఎఫ్ భూ కేటాయింపులతో సంబంధం లేదనడం సమంజసం కాదు: భట్టి విక్రమార్క
డీఎల్ఎఫ్ భూ కేటాయింపులపై కొనసాగుతున్న వివాదంపై కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, భూ కేటాయింపులతో తమకు సంబంధం లేదని ప్రభుత్వం అనడం సమంజసం కాదన్నారు. ఈ ఆరోపణలపై ఇంకా తమకు అనుమానాలున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతే భూములను రిజిస్టర్ చేశారని పేర్కొన్నారు. కాబట్టి, వాస్తవాలేంటో ప్రజలకు వివరించాలని, గత ప్రభుత్వం న్యాయబద్ధంగా చేసిందో, లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ తమకు సంబంధం లేదని సీఎం అంటున్నారన్నారు. కేసీఆర్ తనపై అసహనం వ్యక్తం చేశారన్న భట్టి... ముఖ్యమంత్రికి సహనం, హుందాతనం ఉండాలని సూచించారు.