: బీహార్ ముఖ్యమంత్రి మాంఝిని తొలగించే అవకాశం!


బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి జితన్ రాం మాంఝిని తొలిగించనున్నట్టు ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. తన కార్యాలయంలో ఎక్కువ రోజులు ఉండే అవకాశం కనిపించడం లేదని, తనను సీఎం పదవి నుంచి తొలగించేందుకు పార్టీలోని తన శత్రువులు ప్రయత్నిస్తున్నారని తాజాగా మాంఝి అన్నారు. "నన్ను తొలగించాలని చూస్తున్నారని నాకు తెలుసు. నవంబర్ చివరి వరకు నేను పదవిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు" అని తెలిపారు. దాంతో, ఆయనను తీసివేస్తున్నారన్న ఊహాగానాలకు ఈ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన దళితవర్గం నుంచి వచ్చిన మాంఝి ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో కలకలం రేపాయి. దాంతో, మాజీ సీఎం నితీష్ కుమార్, జేడీ (యు) అధినేత శరద్ యాదవ్ సమావేశమై ఈ విషయంపై రెండు గంటల పాటు చర్చించారు.

  • Loading...

More Telugu News