: కోహ్లీ రెండో స్థానంలో మార్పులేదు... ఓ స్థానం మెరుగైన భువీ


టీమిండియా తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ సోమవారం వన్డే ప్లేయర్ ర్యాంకుల జాబితాలను విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో సఫారీ స్టార్ ఏబీ డివిలీర్స్ అగ్రస్థానం పదిలపరుచుకోగా, ఆ తర్వాత స్థానంలో కోహ్లీ ఉన్నాడు. ఏబీకి కోహ్లీకి మధ్య 25 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. మూడోస్థానంలో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా నిలిచాడు. ఇక, బౌలింగ్ విభాగంలో భారత యువ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓ స్థానం ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ జాబితాలో, సస్పెన్షన్ కు గురైన పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ రెండో ర్యాంకులో, సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ మూడో ర్యాంకులో ఉన్నారు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా నాలుగోస్థానంలో నిలిచాడు.

  • Loading...

More Telugu News