: ఆంధ్రాబ్యాంకులో అగ్ని ప్రమాదం


ప్రకాశం జిల్లాలోని దర్శి ప్రధాన రహదారిపై ఉన్న ఆంధ్రా బ్యాంకులో నేటి ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కంప్యూటర్లు, పలు కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి విద్యుత్ వైర్ల షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News