: రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు: స్పీకర్ తో టీటీడీపీ నేతలు


తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షం తమ సభ్యుడు రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసిందని, సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని టీటీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. నేటి మధ్యాహ్నం అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారితో టీటీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై రెండు పేజీల లేఖను ఆయనకు అందజేశారు. బీఏసీలో ఇద్దరికి అవకాశం ఇస్తామని ముందు ఒప్పుకొని, ఆ తరువాత మాట మార్చారని ఆరోపించారు. పరిస్థితులను చక్కదిద్ది తమ సభ్యుడు మాట్లాడేలా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో కఠిన నిర్ణయం తీసుకుంటామని పరోక్షంగా అవిశ్వాస తీర్మానాన్ని లేఖలో ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News