: కుష్వంత్ సింగ్ నవల ఆధారంగా తరుణ్ తేజ్ పాల్ కూతురు సినిమా
తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కూతురు తియా ఓ చలన చిత్రాన్ని రూపొందిస్తోంది. ప్రముఖ జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ నవల ‘ద సన్ సెట్ క్లబ్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. అత్యాచార ఆరోపణలతో మొన్నటిదాకా జైల్లో ఉన్న తరుణ్ తేజ్ పాల్ ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. ఇటీవల తరుణ్ తేజ్ పాల్ తల్లి కేన్సర్ కారణంగా మరణించారు. తన నానమ్మకు నివాళిగా తాను ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తియా చెప్పారు. "ప్రస్తుతం సదరు చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ప్రధాన పాత్రధారులను అలాగే ఉంచుతూ ఇతర కథనాన్ని మార్చేస్తున్నాను. ఈ చిత్రాన్ని మా నానమ్మకు అంకితమిస్తున్నాను. చిత్ర నిర్మాత కోసం వెతుకుతున్నాం" అని తియా చెప్పారు. ఓ జర్నలిస్ట్ కూతురు, మరో ప్రముఖ జర్నలిస్ట్ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ కార్యానికి నిర్మాతగా ఎవరు ముందుకొస్తారో చూడాలి.