: ఏపీలో తుపాకులకు లైసెన్సులు ఇచ్చి తెలంగాణకు పంపుతున్నారు: టీఆర్ఎస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రొఫెషనల్స్‌కు తుపాకి లైసెన్సులు ఇచ్చి తెలంగాణకు పంపుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణా అసెంబ్లీలో గందరగోళానికి తెరలేపాయి. గన్ లైసెన్సులపై రామలింగారెడ్డి వివరణ కోరుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ నేతపై ఇవి తప్పుడు ఆరోపణలంటూ టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వారంతా సభలో ఆందోళనకు దిగడంతో స్పీకర్ మధుసూదనాచారి టీ విరామం కోసం అసెంబ్లీని పదినిమిషాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.