: నలభీముల కోసం సోషల్ నెట్వర్కింగ్ సైట్


పురాణ పురుషులైన నలుడు, భీముడు గొప్ప వంటగాళ్లుగా పేరుగాంచారు. అందుకే, నేటి తరం వంటవాళ్లను నలభీములతో పోల్చుతుంటారు. ఒకప్పుడు వంటవాళ్లంటే కాస్తంత తక్కువ భావన ఉండేది. ఇప్పుడలా కాదు. వంటశాస్త్రంపై ప్రత్యేక కోర్సులు, కాలేజీలు వచ్చాయి. యువత ఈ రంగంవైపు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా, వంటను వృత్తిగా ఎంచుకునేందుకు పురుషులు సిగ్గుపడడంలేదు. చెఫ్ గా కొంచెం పేరు తెచ్చుకుంటే లక్షల్లో వేతనాలు వారి ముంగిట వాలుతున్నాయి. వారు తయారు చేసే వంటకాలు అలాంటివి మరి. స్టార్ హోటళ్లు, ప్రముఖుల వేడుకల్లో పేరుమోసిన చెఫ్ లు తయారుచేసే వంటకాలను రుచిచూడవచ్చు. మరి, సాధారణ వ్యక్తులు కూడా ఇకపై ఇలాంటి వెరైటీ డిషెస్ గురించి తెలుసుకోవచ్చు. ఎలాగంటారా, ఇప్పుడు చెఫ్ ల కోసం ఓ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఏర్పాటు చేశారు. దానిపేరు ChefHost.com ఈ సైట్ ద్వారా హోస్టుల రూపంలో మామూలు వ్యక్తులు కూడా ప్రవేశించవచ్చు. తమకు నచ్చిన చెఫ్ ను వెతుక్కోవడం, క్యాటరింగ్ ఆర్డర్లు బుక్ చేయడం, కొత్త వంటకాల గురించి తెలుసుకోవడం వంటివి చేయవచ్చట.

  • Loading...

More Telugu News