: రాణించిన భారత పేసర్లు... ప్రాక్టీస్ మ్యాచ్ లో సీఏ ఎలెవన్ స్వల్ప స్కోరు
అడిలైడ్ లో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవన్ జట్టుతో జరుగుతున్న రెండ్రోజుల ప్రాక్టీసు మ్యాచ్ లో భారత పేసర్లు రాణించారు. దీంతో, తొలి ఇన్నింగ్స్ లో సీఏ జట్టు 219 పరుగులకు ఆలౌటంది. టీమిండియా బౌలర్లలో వరుణ్ ఆరోన్ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ 2, మహ్మద్ షమి 2 వికెట్లు తీశారు. లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ, ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ చెరో వికెట్ సాధించారు. అనంతరం, తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ (11*), వన్ డౌన్ బ్యాట్స్ మన్ పుజారా (0*) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ 10 పరుగులు చేసి అవుటయ్యాడు.