: విదేశీ భాషగా జర్మనీ బోధన కొనసాగుతుంది: స్మృతి ఇరానీ


దేశీయ విద్యాలయాల్లో జర్మనీ బోధన ఇకపై కూడా కొనసాగుతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. కేంద్రీయ విద్యాలయాల్లో జర్మనీ స్థానంలో హిందీని ప్రవేశపెట్టాలన్న ఆరెస్సెస్ అనుబంధ విభాగాల డిమాండ్ కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే వారం తిరగకముందే స్మృతి ఇరానీ ఈ విషయంపై యూటర్న్ తీసుకున్నారు. కేంద్రీయ విద్యాలయాల బోధనాంశాల్లో విదేశీ భాషల కింద జర్మనీ బోధన కూడా కొనసాగుతుందని ఆమె ఆదివారం ప్రకటించారు. అంతేకాక "ఫ్రెంచ్, మాండరిన్ తదితర విదేశీ భాషలను బోధిస్తున్నాం. అలాంటప్పుడు జర్మనీని బోధిస్తే తప్పేముంది? విదేశీ భాషల కింద జర్మనీ బోధనను కొనసాగిస్తాం" అని ఆమె తన వాదన వినిపించారు. జర్మనీతో 2011 లో జరిగిన ఒప్పందం ఆధారంగా విదేశీ భాషల కింద దేశీయ విద్యాలయాల్లో జర్మనీ బోధన జరుగుతోంది. సదరు ఒప్పందం, భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందన్న విషయంపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది.

  • Loading...

More Telugu News