: ముద్గల్ కమిటీ నివేదికపై నేను మాట్లాడను: సచిన్


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగుకు సంబంధించి ముద్గల్ కమిటీ రూపొందించిన నివేదికపై మాట్లాడేందుకు ప్రముఖ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ నిరాకరించారు. నివేదికపై తాను మాట్లాడటం సరికాదని చెప్పారు. ఫిక్సింగ్ కేసును సుప్రీంకోర్టు చూసుకుంటుందని అన్నారు. గతవారం సమర్పించిన ముద్గల్ నివేదికపై సుప్రీం ఈ రోజు విచారణ చేపట్టనుంది. ఈ ఫిక్సింగులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కు ఎలాంటి ప్రమేయం లేదని నివేదికలో తేలింది. అయితే, ఈ ఫిక్సింగుతో సంబంధం ఉన్న ఓ క్రికెటర్ ప్రవర్తనా నియమావళి కోడ్ ఉల్లంఘించినప్పటికీ ఆయన చర్యలు తీసుకోలేదని కమిటీ పేర్కొంది. మరోవైపు తిరిగి తనను బీసీసీఐ అధ్యక్షుడిగా నియమించాలని శ్రీని సుప్రీంను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News