: మధ్యాహ్నం 3 గంటలకు మురళీ దేవరా అంత్యక్రియలు
కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా (77) అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ముంబయిలోని చందనవాడి క్రెమటోరియంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. క్యాన్సర్ తో బాధపడుతున్న మురళీ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. మురళీ మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తదితర ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.