: తొలి టెస్టులో క్లార్క్ ను ఆడించేందుకు సిద్ధమైన క్రికెట్ ఆస్ట్రేలియా


నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు డిసెంబర్ 4న ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కు ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ దూరంగా ఉంటాడని తొలుత ప్రకటించిన ఆసీస్ సెలెక్టర్లు, తాజాగా, జట్టులో అతడికి చోటు కల్పించారు. గాయం నుంచి వేగంగా కోలుకున్న క్లార్క్ ఫిట్ నెస్ సాధించాడని, అందుకే అతడిని ఎంపిక చేశామని సెలెక్టర్ రాడ్నీ మార్ష్ తెలిపారు. క్లార్క్ లేకుండా బరిలో దిగి తొలి టెస్టులోనే ఓటమిపాలైతే ఆ ప్రభావం సిరీస్ పై పడుతుందని ఆసీస్ సెలెక్టర్లు భావించినట్టు తెలుస్తోంది. కాగా, తొలి టెస్టుకు ముందు భారత జట్టుతో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ లో క్లార్క్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News