: పూజా భట్ సినిమాలో క్రికెటర్ శ్రీశాంత్


ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో అప్రతిష్ఠపాలైన క్రికెటర్ శ్రీశాంత్ ఇప్పుడో బాలీవుడ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. పూజా భట్ తదుపరి చిత్రంలో శ్రీశాంత్ కీలకపాత్ర పోషించనున్నాడు. ఆ సినిమా పేరు 'క్యాబరే'. అందులో ఓ డ్యాన్సర్ కు శ్రీ మెంటార్ గా వ్యవహరిస్తాడు. ఈ సినిమాకు కౌస్తవ్ నారాయణ్ నియోగి డైరక్టర్. నియోగికి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. వచ్చే ఏడాది జనవరిలో ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రఖ్యాత ఆడియో సంస్థ టి-సిరీస్ కూడా నిర్మాణంలో పాలుపంచుకుంటోంది. దీనిపై పూజా భట్ మాట్లాడుతూ, "ఈ నెల మొదట్లో శ్రీశాంత్ ను అతడి బర్త్ డేకి ఒకరోజు ముందు కలిశాను. సినిమాలో మలయాళీ మెంటార్ పాత్రకు శ్రీశాంత్ అతికినట్టు సరిపోతాడు" అని పేర్కొంది. శ్రీశాంత్ టాలీవుడ్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు రావడం తెలిసిందే.

  • Loading...

More Telugu News