: బ్రహ్మపుత్రపై జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించిన చైనా


బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన జల విద్యుత్ ప్రాజెక్టు ఉత్పత్తిని చైనా ఆదివారం ప్రారంభించింది. 510 మెగావాట్ల సామర్థ్యంతో టిబెట్ లోని జాంగ్మూ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా 2010లో మొదలుపెట్టింది. నిర్మాణం ప్రారంభించిన సమయంలో బ్రహ్మపుత్ర నదీ జలాల లభ్యతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే నదీ జలాల దుర్వినియోగానికి పాల్పడబోమని, జలాలను ఇతర అవసరాల కోసం మళ్లించమని చైనా తమకు హామీ ఇచ్చిందని భారత్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News