: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం... విపక్షాల సహకారం కోరిన మోదీ
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాసేపటి క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు చేరుకున్నారు. కారు దిగిన వెంటనే, పార్లమెంటు ఆవరణలో ఉన్న మీడియాతో మాట్లాడారు. దేశాన్ని పాలించాలని ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని... వారి ఆశలను నెరవేరుస్తామని చెప్పారు. పలు కీలక బిల్లులు ఆమోదం పొందేందుకు విపక్ష సభ్యులు సహకరించాలని కోరారు. విపక్షాల సహకారంతోనే చివరి పార్లమెంటు సమావేశాలు సక్సెస్ అయ్యాయని వెల్లడించారు. అందరం కలసి దేశ అభివృద్ది కోసం పాటుపడదామని మోడీ అన్నారు.