: యాక్టింగ్ వదిలి డైరెక్షన్ వైపు ఏంజెలీనా జోలీ అడుగులు


హాలీవుడ్ బ్యూటీ ఏంజెలీనా జోలీ నటనను వదిలి దర్శకత్వం వైపు అడుగులు వేస్తోందా? ఇటీవలి ఆమె వ్యాఖ్యలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. కెమెరా ముందు నిలబడటం కంటే కెమెరా వెనుక మెగా ఫోన్ పట్టుకుంటేనే ఇష్టమంటోంది. "నాకు నటించడమంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కెమెరా ముందు ఎప్పుడు నిలబడాలన్నా అసౌకర్యంగా ఫీలయ్యేదాన్ని. ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి పెడతా. దర్శకత్వ శాఖలో కూడా రాణిస్తానని ఆశిస్తున్నా" అని ఏంజెలీనా వ్యాఖ్యానించింది. ఈ సంవత్సరం మే నెలలో ఆమె నటించిన 'మేల్ ఫీసెంట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News