: సార్క్ సదస్సులో భారత్, పాక్ ప్రధానుల భేటీ?


భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ల మధ్య భేటీ జరగనుందా? ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ తరహా భేటీ అసాధ్యమనే చెప్పొచ్చు. అయితే సార్క్ సమావేశాల్లో భాగంగా ఈ భేటీని భారత విదేశాంగ వర్గాలు మాత్రం తోసిపుచ్చడం లేదు. నేపాల్ రాజధాని ఖాట్మండూలో రెండు రోజుల పాటు జరగనున్న సార్క్ సదస్సులో పాల్గొనేందుకు నరేంద్ర మోదీ రేపు బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. సదస్సుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో రెండు దేశాల ప్రధానుల మధ్య భేటీపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ "ఇప్పటిదాకా మోదీతో భేటీ కోసం పాక్ ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. అయితే రెండు రోజుల పాటు ఒకే వేదికపై వారిద్దరూ ఉంటున్నారు" అని వ్యాఖ్యానించారు. అయితే ఇరు దేశాల ప్రధానుల మధ్య భేటీ జరగదని మాత్రం ఆయన చెప్పలేదు. దీంతో మోదీ, షరీఫ్ ల మధ్య భేటీ జరిగే అవకాశాలున్నాయన్న వాదన బలపడుతోంది.

  • Loading...

More Telugu News