: టీఎస్ శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు
రెండు రోజుల విరామం అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, విపక్ష పార్టీలన్నీ పలు వాయిదా తీర్మానాలను కోరాయి. పార్టీ ఫిరాయింపులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారనే అంశంపై కాంగ్రెస్, సింగరేణి గనుల స్థితిగతులు, సమస్యలపై బీజేపీ, అంగన్ వాడీ సమస్యలపై టీడీపీ, ఐకేపీ ఉద్యోగుల జీతభత్యాలపై సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. నేటి నుంచి రెండు పూటలా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాలింగ్ అటెన్షన్ కింద నేడు డీఎల్ఎఫ్ పై చర్చ జరగనుంది.