: ఏపీలో నేటి నుంచి ఎర్రచందనం వేలం ప్రారంభం
ఎర్రచందనం దుంగల వేలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభించనుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఎర్రచందనం వేలానికి ఇటీవల సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీంతో వేలానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. డిసెంబర్ 1 దాకా కొనసాగనున్న తొలి విడత వేలంలో 1,460 టన్నుల ఎర్రచందనం దుంగలను వేలం వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తద్వారా ఖజానాకు భారీగానే ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు అటవీ శాఖ డిపోల్లో టన్నుల కొలది మూలుగుతున్నాయి.