: పూరీ క్షేత్రంలో పుర్రెల కలకలం


సుప్రసిద్ధ పూరీ క్షేత్రంలో ఓ బ్రిడ్జి కింద పుర్రెలు బయటపడడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. పూరీ-కోణార్క్ రహదారిపై కుశభద్ర నదిపై నిర్మించిన ఈ వంతెన కింది భాగంలో 20 మానవ కపాలాలు, 3 గేదె తలలు, కొన్ని ఎముకలు లభ్యమయ్యాయని సబ్ డివిజన్ పోలీస్ అధికారి సుభాష్ మహంతి తెలిపారు. నదిలో నీటిమట్టం తగ్గిన తర్వాత ఇవి బయటపడ్డాయని అన్నారు. పుర్రెలు కనిపించిన స్థలంలోనే పూజా సామాగ్రి కూడా లభ్యంకావడంతో మంత్రగాళ్ల పనే అయి ఉంటుందన్న ప్రాథమిక అంచనాకొచ్చారు. ఈ పుర్రెలను ఎక్కడి నుంచో తీసుకువచ్చి, ఇక్కడ క్షుద్రపూజలు నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని మహంతి తెలిపారు.

  • Loading...

More Telugu News