: ఎన్టీఆర్ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు: పురందేశ్వరి
దివంగత ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి శంషాబాద్ డొమెస్టిక్ టెర్మినల్ వ్యవహారంపై స్పందించారు. కర్నూలులో ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు సబబే అని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ ను అవమానపరిచేలా ఎవరూ మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన పేరును అనవసరంగా రచ్చకీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుజాతికి ప్రత్యేక భాష, కల్చర్ ఉందని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని పురందేశ్వరి పునరుద్ఘాటించారు. మరణించిన వ్యక్తిపై రాజకీయం చేయడం తగదని హితవు పలికారు.