: భారత పురుషులు కాంస్యం నెగ్గిన చోట అమ్మాయిలు స్వర్ణం గెలిచారు!
భారత మహిళల జట్టు ఆసియా బీచ్ క్రీడల కబడ్డీలో పసిడి నెగ్గింది. థాయ్ లాండ్ ఫుకెట్ దీవిలో జరుగుతున్న ఈ క్రీడల కబడ్డీ అంశం ఫైనల్లో భారత్ 61-28తో ఆతిథ్య థాయ్ జట్టును చిత్తుగా ఓడించింది. మమత సారథ్యంలో, ప్రియాంక, రణదీప్ కౌర్, కాకోలి బిశ్వాస్, పాయల్ చౌదరి, పరమేశ్వరి అంబలవణన్ లతో కూడిన జట్టు టైటిల్ సమరంలో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. కాగా, పురుషుల కబడ్డీలో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. ఓవరాల్ గా ఆసియా బీచ్ క్రీడల్లో భారత్ 20వ స్థానంలో నిలిచింది. 2 స్వర్ణాలు, 1 రజతం, 7 కాంస్యాలతో భారత్ (10 పతకాలు) ఈ క్రీడలను ముగించింది.