: మరో 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం


బంగాళాఖాతంలో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, రాయలసీమలో సాధారణం కంటే 4 డిగ్రీలు, కోస్తాంధ్రలో సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో రాత్రిపూట చలి ప్రభావం పెద్దగా కనిపించడంలేదు. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ వివరించింది.

  • Loading...

More Telugu News