: నూతన ఇసుక విధానంపై సీరియస్ గా దృష్టిపెట్టిన ఏపీ సర్కారు
నూతన ఇసుక విధానంపై ఏపీ సర్కారు సీరియస్ గా దృష్టి సారించింది. ఇసుక అక్రమ తవ్వకాలకు విరుగుడుగా కొత్త పాలసీ తీసుకువచ్చిన చంద్రబాబు సర్కారు, ఈ విధానం అమలుపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇకపై, నూతన ఇసుక విధానంపై రెండ్రోజులకు ఒకసారి సమీక్ష జరపనున్నట్టు గుంటూరులో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రవాణా ఇబ్బందుల నివారణకు డీటీసీకి కమిటీలో చోటు కల్పిస్తున్నామని తెలిపారు. ఇసుక అక్రమాలపై 18001212020 నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఇసుక విక్రయాల బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక, మంత్రి రుణమాఫీ గురించి మాట్లాడుతూ, తొలి దశలో 60 లక్షల మంది రైతులకు 20 శాతం రుణమాఫీ చేస్తామని తెలిపారు. రెండో దశలో రూ.50 వేలు లేదా రూ.70 వేలు ఒకే దఫా మాఫీ చేస్తామని చెప్పారు.