: అర్పిత పెళ్లి మహత్మ్యం... సల్మాన్ కు శుభవార్త


బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పై నిషేధం విధించిన బాంబే న్యూస్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ (బీఎన్ పీఏ) కాస్త మెత్తబడింది. సల్మాన్ పై నిషేధం ఎత్తివేస్తున్నట్టు బీఎన్ పీఏ కార్యదర్శి రజనీశ్ కకాడే తెలిపారు. చెల్లి అర్పిత పెళ్లి రిసెప్షన్ కు సల్మాన్ న్యూస్ ఫొటోగ్రాఫర్లను కూడా ఆహ్వానించడంతో ఇరు వర్గాల మధ్య సఖ్యతకు బీజం పడింది. దీనిపై కకాడే మాట్లాడుతూ, ఇన్విటేషన్ పంపడం ద్వారా తమతో సల్మాన్ కు సమస్యలేవీ లేవని అర్థమైందని అన్నారు. వివాహ వేడుక జీవితంలో అతిముఖ్యమైనదని పేర్కొంటూ, సంఘం తరపున దంపతులకు తమ శుభాకాంక్షలు తెలిపారు. జులై 11న 'కిక్' సినిమాలోని ఓ పాట ఆవిష్కరణ సందర్భంగా సల్మాన్ ఖాన్ బాడీగార్డులు తమపై దురుసుగా ప్రవర్తించారంటూ ఫొటోగ్రాఫర్లు నిషేధం ప్రకటించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News