: ఇద్దరు భారతీయులకు సెయింట్ హోదా
ఇద్దరు భారతీయులను ఆదివారం వాటికన్ లో జరిగే ఓ కార్యక్రమంలో సెయింట్ లుగా ప్రకటించనున్నారు. కేరళకు చెందిన ఫాదర్ కురియకోస్ చవారా, సిస్టర్ యుఫ్రేషియాలకు పోప్ ఫ్రాన్సిస్ ఈ హోదాను ప్రసాదించేందుకు రంగం సిద్ధమైంది. తమ రాష్ట్రీయులను వాటికన్ అపూర్వరీతిలో గౌరవిస్తుండడంతో కేరళ క్రైస్తవ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనామందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. చవారా 1871 జనవరి 3న మరణించారు. అటు, సిస్టర్ యుఫ్రేషియా 1952 ఆగస్టు 29న మరణించారు.